ప్రభుత్వంతో విఆర్ఎల చర్చలు సఫలం.. రేపట్నుంచి విధులకు హాజరు

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో విఆర్ ఎలు జరిపిన చర్చలు సఫలమయ్యాయని.. వారు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. బిఆర్కే భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో విఆర్ ఎలు సమావేశమయ్యారు. సమావేశంలో ప్రమోషన్లు , ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరామని విఆర్ ఎల ప్రతినిధి వంగ రవీందర్ తెలిపారు. దానికి సిఎస్ సోమేశ్‌కుమార్ సానుకూలంగా స్పందించారని అన్నారు. సమావేశంలో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, రేపట్నుంచి విధులకు హాజరవుతామని తెలిపారు.
Your point of view caught my eye and was very interesting. Thanks. I have a question for you.