భారీ వరద కారణంగా శ్రీరాంసాగర్ 15 గేట్లు ఎత్తివేత

నిజామాబాద్ (CLiC2NEWS): శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతుంది. అధికారులు ప్రాజెక్టు 15 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదిలారు. రాష్ట్రంలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలు కారణంగా జలాశయాలన్ని నిండుకుండలా ఉన్నాయి. భారీగా వరద నీరు ఎగువనుండి వస్తుంది. ప్రాజెక్టులోని 66,340 క్యూసెక్కుల వరద వస్తండగా.. 46,800 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తుంది. ప్రస్తుతం ఎస్సార్ ఎస్‌పిలో 90.313 టిఎంసిల నీరు నిల్వఉంది.