ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్ర‌సాద్‌పై ఫిర్యాదు!

హైదార‌బాద్ (CLiC2NEWS): హిందూ మ‌నోభావాల‌ను దెబ్బతీసారంటూ సంగీత ద‌ర్శ‌కుడు దేవీశ్రీ ప్రాసాద్‌పై సైబ‌ర్ క్రైమ్ పిఎస్‌లో ఫిర్యాదు న‌మోదైంది. ‘ఓ పారి’ ( O Pari) అనే ఆల్బ‌మ్‌లో హ‌రేరామ హ‌రేకృష్ణ అనే మంత్రాన్ని ఐటెం సాంగ్‌గా చిత్రీక‌రించారని న‌టి కరాటే క‌ల్యాణి, ప‌లు హిందూ సంఘాలు దేవీశ్రీ ప్ర‌సాద్‌పై ఫిర్యాదు చేశాయి. అత‌నిపై చ‌ర్యలు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. ప‌విత్ర మంత్రాన్ని అశ్లీల దుస్తులు, డాన్స్‌ల‌తో చిత్రించార‌ని.. వెంట‌నే ఆ పాట‌లో వినిపించే మంత్రాన్ని తొల‌గించాల‌ని డిమాండ్ చేశాయి.

‘ఓ పారి’ అనే గీతం దేవి స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో త‌ను న‌టించిన ఆల్బ‌మ్. ఈ గీతంను పాన్ ఇండియా స్థాయిలో ప‌లు భాష‌ల్లో అక్టోబ‌ర్‌ నెల‌లో విడుద‌ల చేశారు. తెలుగులో ఓ పిల్లా అంటూ సాగుతుంది.

1 Comment
  1. zoritoler imol says

    You are my breathing in, I own few web logs and often run out from brand :). “Truth springs from argument amongst friends.” by David Hume.

Leave A Reply

Your email address will not be published.