24 గంట‌ల్లో వెయ్యిమంది ర‌ష్యా సైనికులు మృతి..

కీవ్ (CLiC2NEWS): ఆయుధాలు లేని ర‌ష్యా సైనికుల‌ను టార్గెట్ చేసుకొని ఉక్రెయిన్ దాడులు చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ర‌ష్యా సైనికులు క‌నీసం 1000 మంది మృతి చెందిన‌ట్లు ఉక్రెయిన్ రక్ష‌ణ‌శాక వ‌ర్గాలు వెల్ల‌డించాయి.

ఉక్రెయిన్‌పై కొన‌సాగుతున్న దాడుల‌కు.. ర‌ష్యా ద‌ళాల‌పై ఉక్రెయిన్‌ ప్ర‌తిదాడికి దిగింది. ఇటీవ‌ల‌ ర‌ష్యా ఉక్రెయిన్‌లో భారీగా సైనికుల‌ను మోహ‌రించింది. అయితే వారి వ‌ద్ద స‌రైన ఆయుధాలు లేవ‌ని .. బ్రిటిష్ ర‌క్ష‌ణ నిఘా వ‌ర్గాల నిపుణులు వెల్ల‌డించారు. దీంతో ఉక్రెయిన్ దాడులు కొన‌సాగించింది. ఈ దాడుల్లో ఒక్క‌రోజులో వెయ్యిమంది క్రెమ్లిన్ సైనికులు మృతిచెందిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.