Hyderabad: జలమండలిలో ఎనిమిది మంది కారుణ్య నియామకం

హైదరాబాద్ (CLiC2NEWS): ఖైరతాబాద్‌లోని జలమండలి కార్యాలయంలో ఎనిమిది మందిని కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగావకాశాలు కల్పించారు. విధులు నిర్వర్తిస్తుండగా మరణించిన జలమండలి ఉద్యోగుల కుటుంబాల్లో ఒక్కొక్కరికి కారుణ్య నియామకాలు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో ఎనిమిది మందికి శనివారం పీఆండ్ఏ సీజీఎం మహ్మద్ అబ్దుల్ ఖాదర్‌తో పాటు, వాటర్‌వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ అధ్యక్షులు రాంబాబు యాదవ్ నియామక పత్రాలు అందజేశారు. వీరిని జలమండలిలోని వివిధ డివిజన్లకు కేటాయించారు. జలమండలిలో కారుణ్య నియామకాల ద్వారా గత సంవత్సరం 91 మంది, ఈ సంవత్సరం ఇప్పటి వరకు 62 మందిని నియమించారు. రెండేళ్లుగా దాదాపు 150 కారుణ్య నియామకాలు జరిగాయి.
ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ ఎంప్లాయిస్ యూనియన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి జైరాజ్, నాయకులు అక్తర్, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
—
Regards,