టిఆర్ఎస్ to బిఆర్ఎస్.. పేరు మార్పుపై బహిరంగ ప్రకటన!

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ ఎస్) పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా (బిఆర్ ఎస్)గా మారుస్తున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసినదే. సోమవారం టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పేరును బిఆర్ఎస్గా పేరు మార్చాలని ప్రతిపాదిస్తూ బహిరంగ ప్రకటన జారీ చేసింది. పేరు మార్పుపై పార్టీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. వాటి కాపీని ఎన్నికల సంఘానికి అందజేశారు. దీనిపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే నెలలోపు సెక్రటరీ (పొలిటికల్ పార్టీ), ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు పంపాలని పబ్లిక్ నోటిస్లో పేర్కొన్నారు.