ఇప్పటం బాధితులకు పవన్ ఆర్థిక సాయం..

అమరావతి (CLiC2NEWS): ఇప్పటం గ్రామంలోని కొంత మంది ఇళ్లు, ప్రహరీ గోడలు ఇటీవల కూల్చివేయబడిన సంగతి తెలిసిందే. జనసేన పార్టీ సభకు స్థలం కేటాయించడంతో.. ప్రభుత్వం వారి నివాసాలను కూల్చివేసిందని బాధితులు ఆరోపించారు. దీంతో ఆమరుసటి రోజే పవన్‌కల్యాణ్ ఇప్పటం వెళ్లి బాధితులను పరామర్శించటం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి అండగా నిలబడి.. బాధితులకు రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు పవన్ ప్రకటించారని.. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.