సూప‌ర్‌స్టార్ కృష్ణ‌ అస్త‌మ‌యం!

హైద‌రాబాద్ (CLiC2NEWS): ప్ర‌ముఖ తెలుగు న‌టుడు న‌ట‌శేఖ‌ర‌, సూప‌ర్ స్టార్ కృష్ణ (79) ఇక‌లేరు. ఆదివారం కార్డియాక్ అరెస్టుకు గురి అయిన కృష్ణ హైద‌రాబాద్‌లోని కాంటినెంట‌ల్ హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ మంగ‌ళ‌వారం తెల్ల‌వారు జామున క‌న్నుమూశారు. కృష్ణ‌ మృతితో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌తో పాటు అభిమానులు శోక‌సంద్రంలో మునిగిపోయారు.

కృష్ణ అస‌లు పేరు ఘ‌ట్ట‌మ‌నేని శివ‌రామ‌కృష్ణ‌మూర్తి. 1942 మే 31వ తేదీన ఎపిలోని గుంటూరు జిల్లా తెనాలి మండ‌లం బుర్రిపాలెంలో వీర‌రాఘ‌వ‌య్య చౌద‌రి, నాగ‌రత్న దంప‌తుల‌కు జ‌న్మించారు. కృష్ణ 1965లో ఇందిర‌ను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు సంతానం. ర‌మేశ్‌బాబు, మ‌హేశ్ బాబు, ప‌ద్మావ‌తి, ప్రియ‌ద‌ర్శిని, మంజుల‌. ఆ త‌ర్వాత న‌టి, ద‌ర్శ‌కురాలు విజ‌య‌నిర్మ‌ల‌ను కృష్ణ రెండ‌వ వివాహం చేసుకున్నారు.

సినీ ప్ర‌స్థానం..
1964లో ప్ర‌ముఖ ద‌ర్శ‌క నిర్మాత ఆదుర్తి సుబ్బారావు తెర‌కెక్కించిన `తేనె మ‌న‌సులు` సినిమాతో సినీ ప్ర‌ యాణం మొద‌లు పెట్టారు. ఈ సినిమా 1965 లో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించిన కృష్ణ 1984లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1989లో ఏలూరు ఎంపిగా పోటీ చేసి ఘ‌న విజ‌యం సాధించారు.

2 Comments
  1. zoritoler imol says

    You are my aspiration, I own few blogs and often run out from brand :). “Follow your inclinations with due regard to the policeman round the corner.” by W. Somerset Maugham.

  2. Very nice post. I just stumbled upon your blog and wanted to say that I’ve really enjoyed browsing your blog posts. In any case I’ll be subscribing to your feed and I hope you write again soon!

Leave A Reply

Your email address will not be published.