ఇకనుండి ప్రతిరోజూ బెయిల్, బదిలీ పిటిషన్ల విచారణ: సుప్రీంకోర్టు

ఢిల్లీ (CLiC2NEWS): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డిపై చంద్రచూడ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజు న్యాయస్థానం కార్యకలాపాలు ప్రారంభం కాగానే బెయిల్ ట్రాన్స్‌ఫర్ పిటిషన్లను విచారించాలని నిర్ణయించారు. పెండింగ్‌లో ఉన్న బెయిల్ బదిలీ పిటిషన్ల విచారణ వేగవంతం చేసి క్రిస్మస్ నాటి పూర్తిచేయలని సూచించారు. ఉన్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న 13 బెంచ్‌లు.. 10 బెయిల్, 10 బదిలీ పిటిషన్లను విచారించాలని సూచించారు. వీటిలో ఎక్కవగా న్యాయసంబంధమైన చిక్కులు ఉండవు కానీ.. పెండింగ్ పడిపోతాయి. ఈ సందర్భంగా జస్టిస్ డివై చంద్రచూడ్ మాట్లాడుతూ కోర్టులో మొత్తం 3,000 ట్రాన్స్‌ఫర్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 13 బెంచ్‌లలో ప్రతి నిత్యం 10 కేసులు విచారిస్తే వారానికి 650 కేసుల విచారణ పూర్తిచేయవచ్చన్నారు. ఐదు వారాల్లో బదిలీ పిటీషన్లన్నీ ముగిసిపోతాయని అన్నారు. ఇదే పద్దతిలో బెయిల్ పిటిషన్లను కూడా విచారించాలని ఆయన సూచించారు.