దేశంలో తొలి ప్రైవేట్ రాకెట్ విక్ర‌మ్-ఎస్‌ నింగిలోకి..

శ్రీ‌హ‌రికోట (CLiC2NEWS): స‌తీశ్ ధ‌వ‌న్ స్సేస్ సెంట‌ర్ నుండి దేశంలో మొద‌టి ప్రైవేట్ రాకెట్ ‘విక్ర‌మ్-ఎస్‌’ నింగిలోకి దూసుకెళ్లింది. హైద‌రాబాద్ చెందిన స్కైరూట్ రోస్పేస్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఈ కారెట్‌ను అభివృద్ధి చేసింది. చాలా త‌క్కువ ఖ‌ర్చుతోనే రెండు సంవ‌త్స‌రాల‌లో దీనిని త‌యారు చేసిన‌ట్లు సంస్థ సిఇఓ ప‌వ‌న్ కుమార్ వెల్ల‌డించారు. అయితే ఈ రాకెట్‌ను ఈ నెల 12వ తేదీనే ప్ర‌యోగించ‌వ‌ల‌సి ఉండ‌గా.. వాతావ‌రణంఓ మార్పులు కార‌ణంగా వాయిదా ప‌డిన‌ట్లు స‌మాచారం. ప్ర‌ముఖ శాస్త్ర‌వేత్త విక్ర‌మ్ సారాభాయ్‌కి నివాళిగా ఈ రాకెట్‌కు విక్ర‌మ్-ఎస్ అని నామ‌క‌రణం చేసిన‌ట్లు వెల్ల‌డించారు. ఈ కార్య‌క్ర‌మానికి కేంద్ర‌మంత్రి జితేంద్ర‌సింగ్ హాజ‌రాయ్యారు. సింగిల్ స్టేజ్ -ఆర్బిట‌ల్ లాంచ్ వెహిక‌ల్ కావ‌టం విక్ర‌మ్‌-ఎస్ రాకెట్ యెక్క ప్ర‌త్యేక‌త‌. ఈ రాకెట్ మూడు పేలోడ్‌ల‌ను అంత‌రిక్షంలోకి తీసుకెళ్లింది.

 

Leave A Reply

Your email address will not be published.