నిజామాబాద్ ఎంపి ఆర్వింద్‌పై కవిత ఫైర్..

హైదరాబాద్ (CLiC2NEWS): బిజెపి ఎంపి ఆర్వింద్‌పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలోని శాసనసభాక్ష కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు నన్ను క్షమించాలని.. నేను ఈరోజు బాధతో మాట్లాడుతున్నాన్నారు. ఇంతవరకూ నేను వ్యక్తిగతంగా ఎవరినీ విమర్శించలేదని, నాగురించి వ్యక్తిగతంగా మా ఇంకోసారి తాను పార్టీ మారుతాననే మాటలు మాట్లాడితే గట్టిగా బుద్ది చెబుతానని అన్నారు. నువ్వు ఎక్కడ పోటీచేసినా వెంటబడి మరీ ఓడిస్తాన్నన్నారు. రాజకీయాలు చేయచ్చు .. కానీ దిగజారి ప్రవర్తించొద్దని హితవు పలికారు.