600 అడుగుల లోతులో పడిపోయిన వాహనం.. 12 మంది మృతి

డెహ్రాడూన్ (CLiC2NEWS): ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చమేలి జిల్లాలోని ఉగ్రం-పల్లా రోడ్డులో 600 అడుగుల లోతు గల లోయలో వాహనం పడిపోయి ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో 12 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో వాహానంలో 12 మంది ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.