తెలంగాణలో శాశ్వత ప్రాతిపదికన ‘కంటివెలుగు’ కేంద్రాలు

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాసుపత్రులలో కంటివెలుగు కేంద్రాలను శాశ్వత ప్రాతిపదిక నెలకొల్పాలని సర్కార్ నిర్ణయించింది. ఇప్పటి వరకు కంటి వెలుగు కార్యక్రమాలు మూడేళ్లకోసారి నిర్వహిస్తున్నా విషయం తెలిసినదే. ఇక నుండి నేత్ర సమస్యలను నిరంతరం పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లా, ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రులలో సామాజిక ఆరోగ్య కేంద్రాలలో కంటి వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని కెసిఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాలలో ప్రతి నిత్యం నేత్ర వైద్యం, పరీక్షలు అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆరోగ్యశాఖకు సూచించింది.