ప్ర‌పంచ‌రికార్డు సాధించిన యువ క్రికెట‌ర్ జ‌గ‌దీశ‌న్

చెన్నై (CLiC2NEWS): త‌మిళ‌నాడు యువ క్రికెట‌ర్ నారాయ‌ణ్ జ‌గ‌దీశ‌న్ లిస్ట్-A మ్యాచ్‌లో అత్య‌ధిక వ్య‌క్తిగ‌త స్కోరును న‌మోదు చేశాడు. జ‌గ‌దీశ‌న్ చిన‌స్వామి స్టేడియంలో ఆరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌తో జ‌రిగిన విజ‌య్ హ‌జారే ట్రోఫీలో 277 (141 బంతుల్లో) ప‌రుగులు సాధించాడు. ఏడి బ్రౌన్ చేసిన 268 ప‌రుగుల స్కోర్‌ను జ‌గ‌దీశ‌న్ అధిగ‌మించాడు. అంతే కాకుండా టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ (264) రికార్డునూ దాటేశాడు.

లిస్ట్ -A మ్యాచ్‌లో ఆరుణాచ‌ల్‌పై త‌మిళ‌నాడు కేవ‌లం రెండు వికెట్ల న‌ష్టానికి 506 ప‌రుగులు చేసింది. జ‌గ‌దీశ‌న్ గ‌త ఐదు మ్యాచ్‌ల్లో హ‌రియాణాపై 128, గోవాపై 168, ఛ‌త్తీస్‌గ‌డ్‌పై 107, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై 114, అరుణాచ‌చ‌ల్‌పై 277 ప‌రుగులు సాధించి.. వ‌రుస‌గా ఐదు సెంచ‌రీలు సాధించిన బ్యాట‌ర్‌గానూ రికార్డుకెక్కాడు.

Leave A Reply

Your email address will not be published.