అన్ని విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావాలి: సిఎం కెసిఆర్
డిసెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్ (CLiC2NEWS): ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్‌లో గురువారం మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో కొనసాగుతున్న పరిస్థితులు, కేంద్రం విధిస్తున్న ఆంక్షలపై చర్చించేందుకు శాసనసభ సమావేశాలను నిర్వహించి, అన్ని విషయాలు ప్రజల దృష్టికి తీసుకురావాలని సిఎం నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముందుకు సాగకుండా కేంద్ర ప్రభుత్వం కుట్ర పూరిత విధానాలతో అడుగడుగునా ఆర్ధిక దిగ్బంధనం చేస్తుందని ఆరోపించారు.
2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే బడ్జెట్ గణాంకాలను అనుసరించి రూపొందించుకున్నవే. రాష్ట్రంలో ఆర్ధిక వనరులను సమకూర్చుకునేందుకు కేంద్రమే ముందుగా ఎఫ్ ఆర్ బిఎం పరిమితులను వెల్లడిస్తుంది. ఈ మేరకు తెలంగాణ ఎఫ్ ఆర్ బిఎం పరిమితిని రూ. 54 వేల కోట్లుగా కేంద్రం ప్రకటించింది. కాగా.. ఈ పరిమితిని రూ. 39వేల కోట్లకు కుదించింది. దీనికారణంగా రాష్ట్రానికి రావల్సిన నిధులు తగ్గాయి. ఆర్ధికంగా పటిష్ఠంగా ఉన్న రాష్ట్రాలు అదనంగా 0.5% నిధుల సేకరణకు ఎఫ్ ఆర్‌బిఎం పరిమితి ఉంటుంది. ఈ సౌలభ్యం కూడా పొందనివ్వకుండా కేంద్రం అడ్డుకుంటుందన్నారు.
తెలంగాణ ప్రజల అభివృద్ధి దృష్ట్యా పలు ఆర్ధిక సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్న విషయం తెలిసినదే. వీటికనుగుణంగా నిధులను సమీకరించుకుంటుండగా.. కేంద్రం కక్షసాధింపు చర్యలతో వాటిని కూడా నిలిపివేసిందన్నారు. వెంటనే ప్రభుత్వాధికారులు అప్రమత్తమై ఆయా ఆర్ధిక సంస్థలతో చర్చలు జరిపి.. వారిచ్చిన నిధులను తిరిగి చెల్లించేంత ఆర్ధిక పరిపుష్టి కలిగి ఉన్నామని వారికి భరోసా కలిగించి, ఒప్పందాల ఉల్లంఘన సిరకాదని వారికి నచ్చజెప్పడం జరిగిందన్నారు.
కేంద్రం యెక్క దిగజారుడు విధానాలతో రాష్ట్రాల గొంతు కోస్తుందన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు తెలియాలని, దీనిలో భాగంగా డిసెంబరు నెలలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సిఎం తెలిపారు.
Hello there! I simply want to offer you a huge thumbs up for the great info you have got here on this post. I will be coming back to your website for more soon.