ఓయూలో సివిల్స్ కోచింగ్ అకాడ‌మీ ప్రారంభం

హైద‌రాబాద్ (CLiC2NEWS): ఉస్మానియా యూనివ‌ర్సిటీలో సివిల్స్ కోచింగ్ అకాడ‌మీని ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ బుధ‌వారం ప్రారంభించారు. యూనివ‌ర్సిటీలో చ‌దువుతున్న గ్రామీణ విద్యార్థులు సివిల్ స‌ర్వీస్ ఉద్యోగాలు సాధించాల‌నే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ అకాడ‌మీ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ అకాడ‌మీ ద్వారా ఒకేసారి వెయ్యి మంది అభ్యార్థుల‌కు కోచింగ్ ఇవ్వ‌నున్నారు. సుమారు రూ.2 కోట్ల వ్య‌యంతో ఈ అకాడ‌మీని ఏర్పాటు చేసి న‌ట్లు అధికారులు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి ఐఎఎస్‌లు వాకాటి క‌రుణ‌, న‌వీన్ మిట్ట‌ల్‌, బుర్రా వెంక‌టేశం, ఉన్న‌త విద్యామండ‌లి ఛైర్మ‌న్ లింబాద్రి, ఓయూ విసి ర‌వీంద‌ర్‌, టిఎస్‌పిఎస్‌పి మాజీ ఛైర్మ‌న్ ఘంటా చ‌క్ర‌పాణితో పాటు ప‌లువురు ప్రొఫెస‌ర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

1 Comment
  1. zoritoler imol says

    My brother suggested I might like this web site. He was totally right. This post actually made my day. You cann’t imagine simply how much time I had spent for this info! Thanks!

Leave A Reply

Your email address will not be published.