తలరాతలు మారాలంటే.. చదువు ఒక్కటే మార్గమన్న సిఎం జగన్
![](https://clic2news.com/wp-content/uploads/2022/12/cm-jagan.jpg)
బాపట్ల (CLiC2NEWS): జిల్లాలోని చుండూరు మండలం యడపల్లిలోని జెడ్‌పి ఉన్నత పాఠశాలలో బుధవారం సిఎం జగన్ విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సిఎం మాట్లాడుతూ.. ఈ రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. ఆర్థికంగా వెనుకబడిన తల్లి దండ్రులు తమ పిల్లలను చదివించడానికి పడుతున్న కష్టాలను చూశానన్నారు. తలరాతలు మారాలంటే చదువు ఒక్కటే మార్గమని.. పిల్లల భవిష్యత్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దేలా మన ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామన్నారు. విద్యార్థులకు బైజూస్ కంటెంట్ అప్లోడ్ చేసి ఉన్న ట్యాబ్‌లను విద్యార్థులకు అందిస్తున్నామన్నారు. రూ. 686 కోట్ల విలువగల మొత్తం 5,18,740 ట్యాబ్‌లు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని ఈ సంర్భంగా తెలిపారు. ప్రతి ఏటా 8వ తరగతిలోకి వచ్చే విద్యార్థులందరికీ ట్యాబ్‌లు అందిస్తామన్నారు.