నేడు విశాఖ క‌న‌క‌మ‌హాల‌క్ష్మి అమ్మ‌వారికి స‌హ‌స్ర ఘ‌టాభిషేకం

విశాఖ‌ప‌ట్నం (CLiC2NEWS): క‌న‌క‌మ‌హాల‌క్ష్మి అమ్మ‌వారికి గురువారం సాయంత్రం 4 గంట‌ల నుండి స‌హ‌స్ర ఘ‌టాభిషేకం నిర్వ‌హించ‌డానికి అధికారుల ఏర్పాట్లు చేస్తున్నారు. మార్గ‌శిర మాసోత్స‌వాల‌లో భాగంగా అయిదో గురువారం అమ్మ‌వారికి పూజా కార్య‌క్ర‌మాలు కొన‌సాగుతున్నాయి. 1008 క‌ల‌శాల‌ల‌తో ప‌సుపు, కుంకుమ క‌లిపిన జ‌లంతో అమ్మ‌వారికి అభిషేకం చేస్తారు. ఈ క్ర‌మంలో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల నుండి రాత్రి 7గంట‌ల వ‌ర‌కు ద‌ర్శ‌నాలు నిలిపివేయ‌నున్నారు. పూజ‌లు ముగిసిన అనంత‌రం భ‌క్తుల‌ను ద‌ర్శనాల‌కు అనుమ‌తిస్తారు. అంతే కాకుండా జ‌గ‌న్నాథ‌స్వామి ఆల‌య ప్రాంగ‌ణంలో 20వేల మంది భ‌క్తుల‌కు మ‌హా అన్న‌దాన కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్నారు.

Leave A Reply

Your email address will not be published.