ధ‌ర్మ‌పురిలో రూ. 66కోట్ల ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాలు: మంత్రి కొప్పుల‌

ధ‌ర్మ‌పురి (CLiC2NEWS): రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వ‌ర్ ధ‌ర్మ‌పురిలో రూ. 66కోట్ల ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేశారు. మ‌న బ‌స్తీ-మ‌న‌బ‌డి కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌, అద‌న‌పు త‌ర‌గ‌తి గ‌దుల నిర్మాణానికి శంకుస్థాప‌న చేశారు. ఈ సంర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ధ‌ర్మ‌పురి నియోజ‌క‌వ‌ర్గ రూపురేఖ‌ల‌లో పూర్తిగా మార్పు వ‌చ్చింద‌న్నారు. సిఎం కెసిఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చార‌ని, విద్యావ్య‌వ‌స్థ‌లో మార్పులు తీసుకొచ్చారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.