న్యాయ‌వాదుల సంక్షేమానికి రాష్ట్ర ప్ర‌భుత్వం కృషి: మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మ‌న్‌, ఇత‌ర కౌన్సిల్ స‌భ్యులు న్యావ‌వాదుల సంక్షేమానికి సంబంధించిన విన‌తిప‌త్రంను శ‌నివారం మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి అందించారు. తెలంగాణ న్యాయ‌వాదుల సంక్షేమ నిధికి ప్ర‌తి సంవ‌త్స‌రం రూ. 10కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ మంజూరు చేయాల‌ని.. దీనివల్ల‌ న్యాయ‌వాదుల కుటుంబాల‌కు ప్ర‌యోజ‌నం చేకూరుతుంద‌ని మంత్రికి వివ‌రించారు. మర‌ణించిన న్యాయ‌వాది నామినీకి న్యాయ‌వాదుల సంక్షేమ నిధి నుండి రూ. 4ల‌క్ష‌లు చెల్లిస్తున్నామ‌ని.. అలాగే ప్ర‌భుత్వం త‌రపునుండి మ‌రో రూ. 4ల‌క్ష‌లు చెల్లించాల‌ని కోరారు. జూనియ‌ర్ న్యాయ‌వాదుల‌కు మూడు సంవ‌త్స‌రాల కాల‌ప‌రిమితికి ప్ర‌తి నెల రూ. 5వ‌లే ఉప‌కార వేత‌నం చెల్లించేలా ప్ర‌భుత్వం త‌ర‌పున చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ప్ర‌భుత్వం న్యాయ‌వాదుల సంక్షేమానికి రూ. 100కోట్లు కేటాయించి.. వీటి నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను అడ్వ‌కేట్ వెల్ఫేర్ ట్ర‌స్ట్‌కు అప్ప‌గించింద‌ని ఈ సంర్భంగా గుర్తుచేశారు. క‌రోనా స‌మ‌యంలో రూ. 25కోట్ల దాదాపు 15వేల మందికిపైగా న్యాయ‌వాదుల‌కు, క్ల‌ర్కుల‌కు స‌హాయం అందించామ‌న్నారు. ఈ అంశాల‌ను ముఖ్య‌మంత్రి దృష్టికి తీసుకెళ్తాన‌న్నారు. అదేవిధంగా స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న‌వంతు కృషి చేస్తాన‌ని హామీ ఇచ్చారు.

2 Comments
  1. Khosla Palmdale says

    With havin so much content and articles do you ever run into any problems of plagorism or copyright violation? My website has a lot of exclusive content I’ve either authored myself or outsourced but it seems a lot
    of it is popping it up all over the web without my permission. Do you know any ways to help prevent content from being ripped off?
    I’d definitely appreciate it.

  2. gateio token says

    I am a student of BAK College. The recent paper competition gave me a lot of headaches, and I checked a lot of information. Finally, after reading your article, it suddenly dawned on me that I can still have such an idea. grateful. But I still have some questions, hope you can help me.

Leave A Reply

Your email address will not be published.