విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం.. పనుల వేగం పెంచాలి: సిఎం జగన్

అమరావతి (CLiC2NEWS): ఎపి ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విజయవాడలోని స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం, స్మృతిమవం ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తిచేయాలని సిఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర మంత్రులు, మేరుగ నాగార్జున, బొత్స సత్యనారాయణ, సిఎస్ జవహర్ రెడ్డి, వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులు పాల్గొన్నారు. విగ్రహం తయారీ, దానిచుట్టూ సివిల్ వర్క్స్, సుందరీకరణ, మైదానాన్ని ప్రధాన రహదారితో అనుసంధానం చేసే పలు అంశాలపై సిఎం అధికారులతో చర్చించారు. అంబేద్కర్ విగ్రహం ఎత్తు పీఠంతో కలుపుకొని మొత్తం 206 అడుగులు ఉంటుంది. స్మృతి వనం ప్రాజెక్టు వ్యయం రూ. 268 కోట్లు. పీఠం మధ్యభాగంలో జి+2 నిర్మాణం.. ప్రాంగణంలో ఒక కన్వెన్షన్ సెంటర్ కూడా ఉంటుంది.
I read this paragraph fully about the resemblance of most up-to-date and previous technologies, it’s awesome article.