విఐపిల రాకతో రాజన్న ఆలయంలో భక్తులకు ఇబ్బందులు!

వేములవాడ (CLiC2NEWS): వేముల వాడ రాజన్న ఆలయంలో పండుగవేళ భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెలంగాణలోని ప్రముఖ శివక్షేత్రం వేముల వాడలో మహాశివరాత్రి వేల శ్రీ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రాజరాజేశ్వరుడి దర్శనం కోసం రాత్రి 11 గంటల నుంచి క్యూలైన్‌లో భక్తులు వేచి ఉన్నారు.
కాగా ఆలయ అధికారులు విఐపిల కోసం సాధరణ భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. సాధరణ భక్తులకు దర్శనాలు నిలిపివేడయంతో గంటల తరబడి భారీ సంఖ్యలో భక్తులు క్యూలైన్లో నే వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. విఐపిల దర్శనాలకు సమయంలో సంబంధం లేకుండా వస్తుంన్న ప్రతీసారి సాధారణ దర్శనాలను అధికారులు నిలిపివేస్తున్నారు. దాంతో గంటల కొద్ది పిల్లలతో క్యూలైన్లో వేచిఉండాల్సిన పరిస్థితి రావడంతో భక్తులు తీవ్ర అసహనానికి గురై ఇవొ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు.