ఈశాన్య రాష్ట్రాలలో కాషాయ హవా..

ఢిల్లీ (CLiC2NEWS): దేశంలో మూడు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో త్రిపుర, నాగాలాండ్‌లలో బిజెపి విజయం సాధించింది. మేఘాలయలో ఎన్‌పిపి నేత కాన్రాడ్ సంగ్మా విజయం సాధించారు. ప్రాంతీయ పార్టీ అయిన యుడిపి 10 సీట్లు, బిజెపి 2, టిఎంసి 5, కాంగ్రెస్ 5, ఇతరులు 20 చోట్ల విజయం సాధించారు. అయితే సంగ్మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టి మార్క్‌కు దూరంగా ఉండటంతో.. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారోనని ఆసక్తికరంగా మారింది.
నాగాలాంగ్‌లో 60 అసెంబ్లీ స్థానాలుండగా.. ఎన్‌డిపిపి-బిజెపి కూటమి 38 స్థానాల్లో విజయం సొంతం చేసుకుంది. త్రిపురలో 60 అసెంబ్లీ స్థానాలకు ఐపిఎఫ్‌టి-బిజెపి కలిపి 33 స్థానాలు గెలుచుకుంది. గత ఎన్నికల్లో బిజెపి ఒక్కటే 36 సీట్లు గెలుచుకుంది. మాణిక్య రాజవంశానికి చెందిన ప్రద్యోత్ సారథ్యంలో ఏర్పడ్డ తిప్రామోథా 12 స్థానాల్లో విజయం సాధించి బిజెపికి గట్టి పోటీ ఇచ్చారు.