అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడాలి: కెటిఆర్
హైదరాబాద్ (CLiC2NEWS): అమ్మాయిలు, అబ్బాయిలను సమానంగా చూడటం అనేది మన ఇంటినుండే ప్రారంభం కావాలని మంత్రి కెటిఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణా హోటల్‌లో నిర్వహించిన విహబ్ 5వ వార్హికోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విహబ్‌కు రూ. 1.30 కోట్లు ఇస్తే స్టార్టప్‌లో దాన్ఇన రూ. 70కోట్లకు పెంచారని తెలిపారు. ఈ సందర్భంగా వి హబ్ ప్రతినిధులకు కెటిఆర్ అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో మహిళా పారిశ్రామిక వేత్తల కోసం సింగిల్ విండో విధానం త్వరలో అమలుచేయబోతున్నట్లు చెప్పారు. మహిళలు ఏరంగంలోనైనా రాణించగలరని కొనియాడారు. యువత అందరూ ఇంజినీరింగ్, డాక్టర్, అంటున్నారని.. వ్యాపారవేత్తలు ఎందుకు కాకూడదని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పిల్లలకు చిన్నప్పటి నుంబే మెళుకువలు నేర్పాలని.. అబ్బాయిలు, అమ్మాయిలు అనే విషయంలో మన ఆలోచనా విధానంలో మార్పురావాలన్నారు. మా తల్లి దండ్రులు నన్ను, చెల్లిని బాగా చదివించారని.. ఒకరు ఎక్కువ.. మరొకరు తక్కువ అనేది వారు ఎప్పుడూ చూపించలేదన్నారు. నాకన్నా ముందే చెల్లి అమెరికా వెళ్లిందని తెలిపారు. అదేవిధంగా మేము కూడా మా పిల్లలను అలానే ట్రీట్ చేస్తామని కెటిఆర్ చెప్పుకొచ్చారు. కింద పడితే మేం ఉన్నామనే ధైర్యాన్ని పిల్లలకు కల్పించాలని.. ఆ నమ్మకం పిల్లలకు ఇవ్వగలిగితే.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఉన్నత స్థానాలను అధిరోహిస్తారన్నారు.