9,10 తేదీల్లో ప‌లు ప్రాంతాల్లో మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం

హైద‌రాబాద్ (CLiC2NEWS): హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో 9వ తేదీ ఉద‌యం 6 గంట‌ల‌నుండి 11వ తేదీ ఉద‌యం 6 గంట‌ల వ‌ర‌కు తాగునీటికి అంత‌రాయం ఏర్ప‌డుతున్న‌ట్లు జ‌ల‌మండ‌లి అధికారులు ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.
రైల్వే శాఖ సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద నూతనంగా ట్రాక్ లైన్ ను నిర్మించ తలపెట్టింది. ఈ రైల్వే లైన్ నిర్మాణానికి ఆటంకం కలగకుండా హైదరాబాద్ మహానగరానికి మంచినీరు సరఫరా చేస్తున్న గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై (జీడీడబ్య్లూఎస్ఎస్) ఫేజ్ – 1 లో కొండపాక నుంచి ఘన్ పూర్ కు ఉన్న 3000 ఎంఎం డయా ఎంఎస్ మెయిన్ పైపు లైన్ కు బ్రిడ్జ్ పాసింగ్ – బైపాసింగ్, ఇంటర్ కనెక్షన్ పనులు జ‌రుగుతున్నాయి. కావున 48 గంటలు కింద పేర్కొన్న రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

పూర్తిగా అంత‌రాయం ఏర్ప‌డు ప్రాంతాలు:

 

(కుత్బుల్లాపూర్): షాపూర్, చింతల్‌, జీడిమెట్ల‌, వాణి కెమిక‌ల్స్, జ‌గ‌ద్గిరిగుట్ట‌, గాజుల రామారం, సూరారం.

(మ‌ల్కాజ్ గిరి/అల్వాల్‌) : డిఫెన్స్ కాల‌నీ.

నాగారం/ ద‌మ్మాయి గూడ‌, కీస‌ర‌.

బొల్లారం : రింగ్ మెయిన్-3 ఆన్ లైన్ స‌ప్లై.

కొంప‌ల్లి : కొంప‌ల్లి, గొండ్ల పోచంప‌ల్లి ప్రాంతాలు.

కొండ‌పాక (జ‌న‌గామ‌, సిద్దిపేట‌), ప్రజ్ఞాపూర్ (గ‌జ్వేల్‌), ఆలేర్ (భువ‌న‌గిరి), ఘ‌న్ పూర్ (మేడ్చ‌ల్‌/ శామీర్ పేట‌), కంటోన్మెంట్ ప్రాంతం, ఎంఈఎస్‌, తుర్క‌ప‌ల్లి బ‌యోటెక్ పార్కు.

(ఉప్ప‌ల్‌) : కాప్రా మున్సిపాలిటీ ప‌రిధి ప్రాంతాలు.

 

పాక్షికంగా అంత‌రాయం ఏర్ప‌డు ప్రాంతాలు:

ఎస్. ఆర్‌. న‌గ‌ర్‌ : బోర‌బండ‌, వెంక‌ట‌గిరి, బంజారాహిల్స్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు, ఎర్ర‌గ‌డ్డ‌, అమీర్ పేట్‌, ఎల్లారెడ్డి గూడ‌, యూసుఫ్ గూడ‌.

కూక‌ట్ ప‌ల్లి : కేపీహెచ్ బీ, మల్యాసియ‌న్‌ టౌన్ షిప్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.

శేరిలింగం ప‌ల్లి: లింగంప‌ల్లి నుంచి కొండాపూర్ వ‌ర‌కు గ‌ల ప్రాంతాలు, గోపాల్ న‌గ‌ర్‌, మ‌యూర్ న‌గ‌ర్‌, రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.

నిజాంపేట్‌ : ప్ర‌గ‌తి న‌గ‌ర్ ప్రాంతం, నిజాంపేట్/ బాచుప‌ల్లి.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని ప్ర‌క‌ట‌న‌లో కోరారు.

Leave A Reply

Your email address will not be published.