గూగుల్ ఉద్యోగులకు ప్రోత్సాహకాలు నిలిపివేత!
వాషింగ్టన్ (CLiC2NEWS): ఉద్యోగులకు ఇచ్చే ప్రోత్సాహకాలను నిలిపివేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. వ్యయ నియంత్రణలో భాగాంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రధాన ఆర్థిక అధికారి ఉద్యోగులకు లేఖ రాశారు. ఖర్చులను తగ్గించుకోవడం కోసం కొత్త ఉద్యోగుల నియామకాలను సైతం నిలిపివస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఉద్యోగులకు ఇచ్చే చిన్న చిన్న ప్రోత్సాహకాల విషయంలో గూగుల్ సంస్థ ఎప్పుడూ ముందుంటుంది. కానీ ఇపుడు కంపెనీ ఖర్చు తగ్గంచు కోవడం కోసం ఉద్యోగులకు ఇచ్చే చిరుతిళ్లు, లాండ్రీ సర్వీస్, కంపెనీ మధ్యాహ్న భోజనాల వంటి వాటిని ఆపేయాలని నిర్ణయించింది. ఈ ప్రోత్సాహకాల కుదింపు ఆఫీసులు ఉన్న ప్రాంతాలు.. అక్కడ ఉండే వసతులను బట్టి మారుతుందని స్పష్టం చేశారు. ఇటీవలే గూగుల్ సంస్థ 12 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపిన విషయం తెలిసినదే. ఉన్న వనరుల్సి సద్వినియో్గం చేసుకునే విధంగా.. కొంత మంది ఉద్యోగులను ఇతర పనుల్లోకి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.