కొండపిండి ఆకు ఉపయోగాలు..
కొండపిండి ఆకుకి ఇతర నామములు పిండి కూర, తిలకపిండి చెట్టు అని అంటారు
శాస్త్రీయ నామము ఎర్వా లానాట కుటుంబము అమరాందేసి.
సంస్కృత నామము భద్ర, పాషణ భేద
స్వభావికము మూలిక ప్రవర్తనము విత్తనముల ద్వారా..
ఉపయోగములు: ఈ మొక్క మొత్తం ఉపయోగానికి వస్తుంది.
దీని ఉపయోగాలు..
పచ్చి వ్రేళ్ళు ముద్దగా నూరి 10 గ్రాములు మింగి నీళ్లు తాగిన మూత్రపిండంలో రాళ్లు కరుగును.
40 మి.లి. సమూల కషాయం రోజుకు రెండుసార్లు సేవించిన కడుపులో బల్లలు తగ్గును
దీని వేర్ల రసము నందు యావక్షరం ఒక గ్రామ కలిపి త్రాగించిన మూత్రబద్ధము హరించి శీఘ్రముగా మూత్రము జారీ అగును. పొత్తికడుపు సుబ్రమగును.
-షేక్. బహార్ అలీ
యోగాచార్యుడు, ఆయుర్వేద వైద్యుడు