రుణయాప్ వేధింపులతో ఓ సాప్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
![](https://clic2news.com/wp-content/uploads/2021/01/dead-body.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): . నగరంలోని ఓ సంస్థలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వ్యక్తి రుణయాప్‌లో అప్పు తీసుకున్నారు. కొంతమేర అప్పు చెల్లించినా.. యాప్ నిర్వాహకులు వేధింపులకు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లా, బి.కొత్తకోట మండలం దయ్యాలవారి పల్లెకు చెందిన ఎస్ శ్రావణ్ కుమార్ ఏడాది క్రితం హైదరాబాద్‌లోని సాప్ట్వేర్ సంస్థలో ఇంజినీర్‌గా ఉద్యోగంలో చేరాడు. ఆరు నెలల కిందట రుణయాప్‌లో అప్పుతీసుకున్నాడు. రూ. 3.50 లక్షల వరకు తిరిగి చెల్లించినా యాప్ నిర్వాహకులు వేధింపులకు గురుచేయడంలో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు సమాచారం. తన తండ్రిని రూ. 4 లక్షలు కావాలని అడిగాడు. ఆయన ఈ నెల 26న డబ్బు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో శ్రావణ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శ్రావణ్ కుమార్ బంధువుల ఊరైన మొరంపల్లెలోని పూతల పల్లేశ్వరస్వామి ఆలయంలోని ఉరేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. అతని వద్ద కొడవలి, కత్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తు్న్నారు.