Jio Bharat .. రూ. 999కే 4జి ఫోన్

బిజినెస్ (CLiC2NEWS): రిలయన్స్ జియో సంస్థ కేవలం రూ.999 కే 4జి ఫోన్ను అందించనుంది. 2జి వినియోగదారులను 4జికి మార్చేందుకు జియో భారత్ పేరుతో కొత్త ఫోన్ను లాంఛ్ చేసింది. దీనిలో 4జి నెట్వర్క్తో పాటు అపరిమిత కాల్స్, యుపిఐ పేమెంట్స్ వంటి సదుపాయాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. దేశ వ్యాప్తంగా 25 కోట్ల మంది 2జి ఫోన్స్ వాడుతున్నట్లు జియో ఛైర్మన్ ఆకాశ్ అంబాని వెల్లడించారు. జియో భారత్ ఫోన్ కు నెలకు రూ. 123 రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. 28 రోజుల వ్యాలిడిటితో పాటు 14 జిబి డేటా వస్తుంది. అదే సంవత్సరానికి అయితే 1234తో రాఛార్జ్ చేయాల్సి ఉంటుందని.. రోజుకు 0.5 జిబి చొప్పున మొత్తం 168 జిబి డేటా లభించనుంది.