మహిళా రిజర్వేషన్ బిల్లు.. రాష్ట్రపతి ఆమోదం
![](https://clic2news.com/wp-content/uploads/2022/06/drowpathi-murmu.jpg)
ఢిల్లీ (CLiC2NEWS): చారిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ అనే పేరుతో పార్లమెంట్ ఉభయసభలలో ఆమోద ముద్ర వేసుకున్న ఈ బిల్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో ఇక చట్ట రూపం దాల్చింది. మూడు దశాబ్దాల నిరీక్షణకు రాష్ట్రపతి ఆమోదంతో తెరపడినట్లైంది. కానీ ఈ చట్టం ఇపుడే అమల్లోకి వచ్చే అవకాశాలు లేవు. జనగణన, డీలిమిటేషన్ అనంతరం ఈ చట్టాలు అమల్లోకి రానున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు.