బ్యాంకు ఉద్యోగి చేతి వాటం.. ఓ వ్యక్తి ఖాతానుండి రూ. 14 లక్షలు స్వాహా..
అచ్చంపేట (CLiC2NEWS): ఓ బ్యాంకు ఉద్యోగి చేతివాటం ప్రదర్శించాడు. ఎస్బిఐ ఖాతాదారుడి రూ. 14 లక్షల సొమ్మును తన ఖాతాకు బదిలీ చేసుకున్నాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో చోటుచేసుకుంది. అచ్చంపేట పట్టణంలోని ఎస్బిఐ ఉద్యోగి.. తాడూరు గ్రామానికి చెందిన వినోద్ కుమార్ ఖాతా నుండి మూడు విడతలుగా మొత్తం రూ. 14 లక్షలు తన ఖాతాకు బదిలీ చేశాడు. బాదితుడు సెప్టెంబర్ 29న ఖాతానుండి రూ. లక్ష తీసుకొనేందుకు వెళ్లగా.. ఖాతాలో అంత మొత్తం లేదని క్యాషియర్ చెప్పాడు. దీంతో మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు.
అంతేకాకుండా ఓ మహిళకు నకిలీ ఎఫ్డి పత్రం ఇచ్చి రూ. 4 లక్షలు మాయం చేశాడు. నడింపల్లి గ్రామానికి చెందిన మహిళ.. తన భర్త మృతి చెందడంతో రైతు భీమా పరిహారం కింద వచ్చిన సొమ్మును ఎస్బిఐలో ఫిక్స్ డిపాజిట్ చేసింది. బ్యాంకులో పనిచేసే సిబ్బంది నిర్ధారణ పత్రాన్ని ఇచ్చారు. సెప్టెంబర్15న సదరు మహిళ ఫిక్స్డ్ డిపాజిట్ బాండు తనఖాతో లోన్ తీసుకొనేందుకు బ్యాంకుకు వచ్చింది. పత్రాన్ని పరిశీలించిన సిబ్బంది అది నకిలీదని తెలిపారు. ఈ రెండు ఘటనలతో