జర్నలిస్టులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం..!

జైపుర్ (CLiC2NEWS): రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో జర్నలిస్టులకు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పించనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కేవలం ఎన్నికల్లో విధులు నిర్వహించే ఉద్యోగులకు, ఆర్మీ, పారా మిలిటరీ సిబ్బందికి మాత్రమే ఈ సౌకర్యం ఉండేది. ఇకనుండి మొత్తం 8 శాఖల్లో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పింనున్నట్లు అధికారులు వెల్లడించారు. రాజస్థాన్‌లో నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తొలిసారిగా మీడియా సిబ్బందితో పాటు విద్యుత్తు, రవాణా, వైద్యులు, పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్ వర్కర్లు, ఇంధన శాఖల్లో ఎలక్ట్రీషియన్లు, పబ్లిక్ హెల్త్ ఇంజినీరంగ్ విభాగంలో లైన్‌మెన్లు, పంప్ ఆపరేటర్లు, అగ్నిమాపక సిబ్బందికి ఈ సదుపాయం కల్పించనున్నారు.