6.2 తీవ్రతతో కొలంబొలో భూకంపం..
కొలంబొ (CLiC2NEWS): శ్రీలంక రాజధాని కొలంబొలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రతగా నమోదయైంది. భూకంప తీవ్రతకు ఇళ్ల గోడలు భీటలు వారినట్లు సమాచారం. ప్రజలందూ భయాందోళనకు గురై ఇండ్ల నుండి బయటకు పరుగులు తీసినట్లు తెలుస్తోంది. కొలంబొకి ఆగ్నేయ దిశగా 1326 కిలోమీటర్ల దూరంలో 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. మరోవైపు భారత్‌లోని లద్ధాఖ్‌లోనూ భూమి స్వల్పంగా కంపించినట్లు సమాచారం. మంగళవారం మధ్యాహ్నం 1.08 గంటలకు కొన్ని సెకన్ల పాటు భూమికంపించినట్లు వెల్లడించారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.4గా నమోదైంది. కార్గిల్‌కు వాయువ్య దిశలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఇటీవల నేపాల్‌లో వరుసగా భూమికంపించడం వలన ప్రాణనష్టం కూడా జరిగిన విషయం తెలిసింది. ఆ తీవ్రత భారత్‌లోనూ పలు చోట్ల ప్రభావం కనిపించింది. సోమవారం సాయంత్రం కూడా తజకిస్థాన్‌లో భూమి కంపించింది. 4.9 తీవ్రతతో భూమి కంపించినట్లు సమాచారం. ఇపుడు తాజాగా శ్రీలంకలో భూమి కంపించింది.