29 మంది మ‌య‌న్మార్ సైనికులు భార‌త్‌లోకి..

ఐజ్వాల్‌ (CLiC2NEWS): మ‌య‌న్మార్ సైనికులు కొంద‌రు మిజోరామ్ స‌రిహ‌ద్దుల నుండి భార‌త్‌లోకి ప్ర‌వేశించారు. ఉగ్ర‌వాదుల‌కు మ‌య‌న్మార్ సైనికుల‌కు మ‌ధ్య జ‌రుగుతున్న కాల్పుల కార‌ణంగా 29 మంది సైనికులు భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు స‌మాచారం. అయితే వారిని తిరిగి వారి దేశానికి పంపేశారు. ఈ మేర‌కు మిజోరం ప్ర‌భుత్వ ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు. న‌వంబ‌ర్ 16న మ‌య‌న్మార్ లోని చిన్ రాష్ట్రంలోని సైనిక క్యాంప్‌పై, పీపుల్స్ డిపెన్స్ ఫోర్స్ మ‌ద్ద‌తు క‌లిగిన స్థానిక ఉగ్ర‌వాద గ్రూపు దాడి చేసింది. దీంతో ప్ర‌ణాలు కాపాడుకొనేందుకు ప‌లువురు సైనికులు మిజోరాంలోని చాంపై జిల్లాలో ఉన్న అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుల గుండా భార‌త్‌లో ప్ర‌వేశించారు.

భార‌త్ నుండి ఇప్ప‌టి వ‌ర‌కు వెన‌క్కి వెళ్లిన‌ మ‌య‌న్మార్ సైనికుల సంఖ్య 74కి చేరిన‌ట్లు స‌మాచారం. గతంలోకూడా 45 మంది మ‌య‌న్మార్ సైనికుల మిజోరాం స‌రిహ‌ద్దులు గుండా భార‌త్‌లోకి ప్ర‌వేశించారు. వారిని తిరిగి వెన‌క్కి పంపిచారు. మ‌యన్మార్ ఘ‌ర్ష‌ణ‌ల కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు సుమారు 5వేల మంది సాధార‌ణ పౌరులు భార‌త్‌లోకి ప్ర‌వేశించిన‌ట్లు తెలుస్తోంది. వారిలో చాలా మందిని తిరిగి వెన‌క్కి పంచిన‌ట్లు స‌మాచారం.

Leave A Reply

Your email address will not be published.