హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి..

హైదరాబాద్ (CLiC2NEWS); తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐపిఎస్ అధికారులను బదిలీ చేసింది. హైదరాబాద్ సిపిగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి, సైబరాబాద్ సిపిగా అవినాష్ మహంతి, రాచకొండ సిపిగా సుధీర బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర, రాజకొడ సిపి దేవేంద్రసింగ్ చౌహాన్లను డిజిపికి రిపోర్టు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. నార్కొటిక్ బ్యూరో డైరెక్టర్గా సందీప్ శాండిల్యను నియమించింద.