తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎంపిక..

జైపుర్ (CLiC2NEWS): రాజస్థాన్‌లో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది బిజెపి అధిష్ఠానం. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 115 సీట్లు సాధించిన బిజెపి పార్టీ నూతన ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యే భజన్‌లాల్ శర్మ ను ఎంపిక చేసింది. ఆయనను శాసనసభా పక్ష నేతగా ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జైపుర్‌లో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రులను కూడా ప్రకటించారు. దియా సింగ్ కుమారి, ప్రేమ్ చంద్ బైర్వా డిప్యూటి సిఎంలుగా ఎంపిక చేశారు. బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నా భజన్‌లాల్ శర్మ అసెంబ్లీకి ఎన్నికవడం ఇదే తొలిసారి. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిపై 48 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు.