దయచేసి ఆస్పత్రికి ఎవరూ రావొద్దు.. కెసిఆర్

హైదరాబాద్ (CLIiC2NEWS): ఆస్పత్రిలో తనను పరామర్శించేందుకు ఎవరూ రావొద్దని మాజి సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. కెసిఆర్ యశోద ఆస్పత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో ఆయనను పరామర్శించేందుకు నేతలు, అభిమానులు వెళుతున్నారు. దీంతో ఇన్‌ఫెక్షన్ ఎక్కువయ్యే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో పది రోజుల వరకు తనను చూడడానికి అభిమానులు ఎవ్వరూ ఆస్పత్రికి రావొద్దని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. నేను త్వరలో కోలుకుని మీ మద్యకు వస్తా.. నాపట్ల అభిమానం చూపుతున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దయచేసి సహకరించండి అంటూ ఆయన పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు.