తెలంగాణ జెన్కో రాత పరీక్షలు వాయిదా..

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ఈ నెల 17వ తేదీన జరగాల్సిన రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. డిసెంబర్ 17వ తేదీన ఇతర పరీక్షలు ఉన్నందున ఆరోజు జరగాల్సిన జెన్కో పరీక్షలను వాయిదా వేసినట్లు తెలంగాణ జెన్కో వెల్లడించింది. అయితే ఈ పరీక్షలు మరల ఎప్పుడు నిర్వహిస్తారనే విషయం త్వరలో ప్రకటించనుంది. రాష్ట్రంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో జెన్కో పరీక్షలు వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. డిసెంబర్ 17వ తేదీన ఇతర పరీక్షలు ఉన్నందున వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్‌బాబుకు వినతులు సమర్పించారు. ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్తానని.. సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ క్రమంలో తెలంగాణ జెన్కో పరీక్షలు వాయిదా వేసినట్లు ప్రకటించింది.