ఇంటిలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాల‌కు చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 15..

 

ఇంటిలిజెన్స్ బ్యూరోలో మొత్తం 995 అసిస్టెంట్ సెంట్ర‌ల్ ఇంటెలిజెన్స్ ఆఫీస‌ర్‌(ACIO) గ్రేడ్‌-2 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ద‌ర‌ఖాస్తు గ‌డువు ఈనెల 15తో ముగియ‌నుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇంటిలిజెన్స్ బ్యూరోలోని పోస్టుల‌ను భ‌ర్తీకి గ‌త నెల‌లో నోటిఫికేష‌న్ వెలువ‌డింది. ఏదైనా గుర్తింపు పొందిన వ‌ర్సిటీ నుండి డిగ్రీ ఉత్తీర్ణులైన‌వారు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 18 నుండి 27 ఏళ్లు లోపు వారు అర్హులు. ఎంపిక ఆన్‌లైన్ ప‌రీక్ష ద్వారా నిర్వ‌హిస్తారు. టైర్‌-1, టైర్‌-2, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. తెలంగాణ‌లోని హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌, వ‌రంగ‌ల్‌, వ‌రంగ‌ల్ అర్బ‌న్.. ఎపిలోని విజ‌య‌వాడ‌, చీరాల‌, గుంటూరు, రాజ‌మండ్రి, కాకినాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం, క‌ర్నూలు, అనంత‌పురం, తిరుప‌తి ల‌లో ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష కేంద్రానికి సంబంధించి అభ్య‌ర్థులు ఐదు కేంద్రాల‌ను ఎంపిక చేసుకోవ‌చ్చు.

Leave A Reply

Your email address will not be published.