రాబోయే రెండు, మూడు రోజులు చ‌లి తీవ్ర‌త అధికం..

హైద‌రాబాద్ (CLiC2NEWS): రాష్ట్రంలో చ‌లి తీవ్ర‌త ఎక్కువ‌వుతుంది. రాగ‌ల రెండు రోజుల్లో ప‌గ‌టిపూట ఉష్ణోగ్ర‌త‌లు త‌గ్గి.. చ‌లి క్ర‌మంగా పెరుగుతుంద‌ని హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ కేంద్ర తెలిపింది. రెండు, మూడు రోజుల తర్వాత మామూలు స్థితికి వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు అధికారులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఈ నెల చివ‌రి వారం నుండి చ‌లి మ‌రింత పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్లు, దీంతో పాలు శీత‌ల గాలులు కూడా వీస్తాయ‌న్నారు. ప్ర‌స్తుతం న‌గ‌రం శివారు ప్రాంతాల్లో రాత్రిపూట 12 నుండి 13 డిగ్రీల మ‌ధ్య ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. 28 నుండి 29 వ‌ర‌కు ప‌గ‌టి ఉష్ణోగ్ర‌త‌లు న‌మోద‌వుతున్నాయి. మ‌రో రెండు రోజులు ఇదే ప‌రిస్థితి ఉండే అవ‌కాశం ఉన్న‌ట్లు వాతావర‌ణ శాఖ అధికార‌లు వెల్ల‌డించారు.

Leave A Reply

Your email address will not be published.