శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు 51 ప్రత్యేక రైళ్లు..

హైదరాబాద్ (CLiC2NEWS): అయ్యప్ప భక్తులకు శుభవార్త.. శబరిమలకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్తనందించింది. తెలుగు రాష్ట్రాల నుండి శబరిమల క్షేత్రానికి 51 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. డిసెంబర్-జనవరి మాసాల్లో వివిధ తేదీల్లో రాకపోకలు కొనసాగించే రైళ్ల నెంబర్లు వాటి వివరాలు ఎక్స్‌లో షేర్ చేసింది.ఈ ప్రత్యేక రైళ్లలో ఎసి, సెకండ్ ఎసి, థర్డ్ ఎసితో పాటు స్లీపర్, సెకెండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.