6.2 తీవ్రతతో చైనాలో భూకంపం.. 110 మంది మృతి
బీజింగ్ (CLiC2NEWS): చైనాలోని వాయువ్య గన్స్, కింగ్ హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 6.2 తీవ్రత నమోదయింది. ఈ ప్రమాదంతో సుమారు 116 మందికిపైగా మృతిచెందారు. 200 మందికి పైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. పలు భవనాలు సైతం నేలమట్టమయ్యాయి. భూకంపం ధాటికి సుమారు 6,381 ఇళ్లు ధ్వంసంమైనట్లు సమాఆచరం. సోమవారం ఆర్ధరాత్రి దాటాక ఈ భూకంపం సంభవించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. సహాయక బృందాలు చర్యలు చేపట్టాయి. చైనా అధ్యక్షుడు షిజిన్‌పింగ్ అధికారులను అప్రమత్తం చేశారు.