వంద రోజుల్లో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం.. సిఎం
![](https://clic2news.com/wp-content/uploads/2023/12/CM-Revanth-Reddy.jpg)
హైదరాబాద్ (CLiC2NEWS): ఉమ్మడి జిల్లాలకు మంత్రులను ఇంఛార్జిలుగా నియమించి వారి బాధ్యతలు అప్పగించామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 100 పడకల ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందిన, విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు పెరిగేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో ఉన్న యువతకు వారి వారి ఆసక్తి కి తగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. సిఎం మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. నావద్ద చెప్పేది ఒకటి.. చేసేది మరొకటుండదని ఈ సందర్బంగా తెలిపారు. ప్రెస్ అకాడమి ఛైర్మన్ నియామకం తర్వాతే జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన అన్ని సమస్యలను వంద రోజుల్లో పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని సిఎం తెలిపారు.