ఫిబ్ర‌వ‌రి నుంచి ఉచిత విద్యుత్ హామీ అమ‌లు: మంత్రి కోమ‌టిరెడ్డి

హైద‌రాబాద్ (CLiC2NEWS): 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీని ఫిబ్ర‌వ‌రి నెల నుంచి అమ‌లు చేస్తామ‌ని తెలంగాణ ర‌హ‌దారులు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెల్ల‌డించారు. గాంధీభ‌వ‌న్‌లో మంగ‌ళ‌వారం స‌మావేశ‌మైన కాంగ్రెస్ మేనిఫెస్టో క‌మిటీలో కోమ‌టిరెడ్డితో పాటు స‌భ్యులు శ్రీ‌ధ‌ర్‌బాబు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇన్‌చార్జి దీప్‌దాస్ మున్షి , ఇత‌ర స‌భ్యులు పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో ఎల‌క్ష‌న్ల వేళ ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీల‌పై క‌మిటీ స‌భ్యులు చ‌ర్చించారు.

స‌మావేశం అనంత‌రం మంత్రి కోమ‌టిరెడ్డి మీడియాతో మాట్లాడారు… ఎన్నిక‌ల సంద‌ర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్ర‌తీ హామీని నెర‌వేర్చుతామ‌ని అన్నారు. కెసిర్ స‌ర్కార్ నిర్వాకం వ‌ల్ల రాష్ట్రం అప్పుల‌పాలైంద‌ని ఆరోపించారు. అందువ‌ల్లే హామీల అమ‌లులో జాప్యం జ‌రుగుతోంద‌ని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.