మాజి ఉప ప్రధాని ఎల్కె అద్వానీకి ‘భారతరత్న’..

ఢిల్లీ (CLiC2NEWS): మాజి ఉప ప్రధాని, బిజెపి అగ్రనేత ఎల్కె అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం ‘భారతరత్న’..కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. లాల్ కృష్ణ అద్వాని దేశాభివృద్దిలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. 2015లో అద్వాని పద్మవిభూషన్ పురస్కారం అందుకున్నారు.