AP: డిఎస్‌సి నోటిఫికేష‌న్ విడుద‌ల..

అమ‌రావ‌తి (CLiC2NEWS): ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం డిఎస్‌సి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నెల 12వ తేదీ నుండి ద‌ర‌ఖాస్తులను స్వీక‌రించ‌నున్నారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న తరుణంలో మొత్తం 6,100 పోస్టుల‌కు బుధ‌వారం నోటిఫికేష‌న్ విడుద‌ల చేశారు. వీటిలీ ఎస్‌జిటి పోస్టులు 2,280 , స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,299, టిజిటి 1,264, పిజిటి 215, ప్రిన్సిప‌ల్ 42 పోస్టులు ఉన్నాయి. డిఎస్‌సి ప‌రీక్ష‌తో పాటు టెట్ ప‌రీక్ష నోటిఫికేష‌న్ కూడా విద్యాశాఖ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల చేశారు. టెట్‌కు ఫిబ్ర‌వ‌రి 8వ తేదీ నుండి ద‌ర‌ఖాస్తులు స్వీక‌రిస్తారు.

Leave A Reply

Your email address will not be published.