కరెంట్ తీగ తెగిపడి ముగ్గురు మృతి

పర్వతగిరి (CLiC2NEWS): మోత్య తండా వాసులు పండుగ జరుపుకుంటుండగా విద్యుత్ తీగ తెగిపడి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలోని పర్వతగిరి మండలం మోత్య తండాలో సోమవారం చోటుచేసకుంది.తండావాసులంతా దుర్గమ్మ పండుగను జరుపుకుంటున్న సందర్భంలో భూక్యరవి, అతని బావ దేవందర్ ఇంటిముందు టెంట్ వేస్తున్నారు. క్రమంలో కరెంటు తీగ తెగిపడింది. ఈ ప్రమాదంలో దేవేందర్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. భూక్య రవి, సునీల్.. రవి కుమారుడు జశ్వంత్ , రవి పెదనాన్న ఈర్యకు తీవ్రగాయలయ్యాయి. చికిత్స కోసం ఎజంజిఎం కు తరలిస్తుండగా.. రవి, సునీల్ ప్రాణాలు కోల్పోయారు. జశ్వంత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.