50 ఏళ్లకే పింఛను బిసి డిక్లరేషన్ విడుదల..

మంగళగిరి (CLiC2NEWWS): ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో నిర్వహించిన ‘జయహో బిసి’ సభలో బిసి డిక్లరేషన్ను చంద్రబాబు, పవన్ విడుదల చేశారు. బిసిలకు 50 ఏళ్లకే పింఛను.. నెలకు రూ. 4 వేలకు పెంపు.. ప్రకటించిన టిడిపి-జనేసేన.
డిక్లరేషన్లో ముఖ్యాంశాలు..
- బిలకు 50 ఏళ్లకే పింఛను.. నెలకు రూ. 4 వేలు..
- పెళ్లి కానుక రూ. లక్షకు పెంపు
- విద్యాపథకాలు అన్ని పునరుద్ధరిస్తామన్నారు.
- షరతులు లేకుండా విదేశీ విద్య అమలు.
- చట్టసభల్లో బిసిలకు 33% రిజర్వేషన్ కోసం తీర్మానం
- అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్
- జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్ల ఏర్పాటు
- గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్
- ఏడాదిలో బిసి భవనాలు, కమ్యూనిటి హాళ్ల నిర్మాణం