పరీక్ష లేకుండా నేవీలో సబ్‌లెప్టినెంట్ హోదాలో పోస్టులు..

INDIAN NAVY: షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో భారత నౌకాదళంలో 254 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు అవివాహిత స్త్రీ, పురుషుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. అకడమిక్ మార్కుల మెరిట్ ప్రకారం ఎంపిక జరుగుతుంది. శిక్షణ అనంతరం సబ్ లెప్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. మూల వేతనం రూ. 56,100 ఉంటుంది. దీనికి డిఎ, హెచ్ ఆర్ ఎ, ఇతర ప్రోత్సాహకాలుతో కలిపి మొదటి నెల నుండే రూ. లక్షకుపైగా జీతం అందుతుంది.
బిటెక్, ఎంఎ, ఎమ్ ఎస్‌సి, ఎంబిఎ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, టెక్నికల్ బ్రాంచ్‌లలో పోస్టులు ఉన్నాయి. వీటికి రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులు పదేళ్లపాటు విధుల్లో కొనసాగుతారు. అనంతరం రెండేళ్లు చొప్పున రెండు సార్లు సర్వీసు పొడిగిస్తారు. మొత్తం 14 ఏళ్లపాటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. అనంతరం విధులు నుండి వైదొలగాలి. ఈ పోస్టులకు జనవరి 2, 2000 నుండి జనవరి 1, 2004/2005/2006 మధ్య జన్మించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 10గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు https://www.joinindiannavy.gov.in/ వెబ్‌సైట్ చూడగలరు.