టిడిపి, జనసేన. బిజెపి పొత్తు.. ముగిసిన సీట్ల సర్దుబాటు
TDP 144 Assembly and 17 Lok Sabha seats

అమరావతి (CLiC2NEWS): ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీలు సీట్ల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం టిడిపి, బిజెపి, జనసేన ప్రతినిధులు సమావేశమైన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చల అనంతరం సీట్లు కేటాయింపు కొలిక్కి వచ్చింది. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేయనున్నది. జనసేన 2 లోక్‌సభ, 21 శాసససభ స్థానాల్లో పోటీచేస్తుంది. బిజెపి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలలో పోటీ చేయనుంది.
సోమవారం ఎకావత్, పండా, పవన్‌కల్యాణ్.. చంద్రబాబు నివాసంలో సమావేశమయ్యారు. రాత్రి 8 గంటల వరకు చర్చలు కొనసాగిన అనంతరం షెకావత్, పండా చంద్రబాబు నివాసం నుండి తిరుగు ప్రయాణమయ్యారు. టిడిపి ఇప్పటికే 94, జనసేన 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన విషయం తెలిసిందే. టిడిపి రెండో జాబితాను ఈనెల 14న ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. బిజెపి అరకు, అనకాపల్లి, విజజయగరం, రాజమహేంద్రవరం, నరసాపురం, తిరుపతి లోక్‌సభ స్థానాల్లో.. జనసేన కాకినాడ, మచిలీపట్నం లలో పోటీ చేయనుంది.